కీర్తి.. వివరణ కాదు, నిర్ణయం తీసుకో

52
- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేష్ ఫలానా వ్యక్తితో ప్రేమలో ఉందని, లేదూ ఫలానా అతనితో ఆమె డేటింగ్ మాత్రమే చేస్తోందని.. అలాగే మధ్యమధ్యలో కీర్తి సురేష్ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇలా రకరకాలుగా అనేక వార్తలను వైరల్ చేస్తూనే ఉన్నారు. అయితే, ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఇటీవల పర్హాన బీన్ లియాకత్‌ అనే వ్యక్తితో కీర్తి సురేష్ చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం కనిపించింది. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తెలిసిందే. అతని బర్త్‌డే ఫంక్షన్‌కు ప్రత్యేకంగా స్పెషల్ విషెస్ చెబుతూ కూడా కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. దీంతో వీరిద్దరూ దిగి ఉన్న ఫొటోలు నెట్టింట్ల వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు చూసి కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతుందని అందరూ నమ్ముతున్నారు. కట్ చేస్తే.. పెళ్లి లేదు.. ఏం లేదు.. ఆపండయ్యా బాబూ అంటూ తనతో ఈ విషయం గురించి మాట్లాడిన వారితో కీర్తి సురేష్ చెబుతున్న మాట ఇది. మొత్తానికి పెళ్లి అని మాట ఎత్తగానే కీర్తి సురేష్ వెంటనే అసహనం వ్యక్తం చేసింది. తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తోంది. అయినా, పుకార్లు మాత్రం రూపాంతరం చెందుతూ ఇంకా రకరకాలుగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇదే క్రమంలో కీర్తి సురేష్ పెళ్లి పై కొత్త పుకారు కూడా షికారు చేసింది.

Also Read: పిక్ టాక్ : మండే ఎండల్లో వేడి పెంచుతున్న నిక్కీ

అయితే, తను పెళ్లి చేసుకోవడం లేదని.. పుకార్లు ఆపండి అంటూ కీర్తి సురేష్ సింగిల్ డైలాగ్ తో ఫుల్ స్టాప్ పెట్టేస్తోంది. ఐతే, కీర్తి సురేష్ కి ఇలా తన పెళ్లి పుకార్లను ఖండించడం కొత్తేమీ కాదు, పైగా ఖండించే కొద్దీ.. కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, ఈ ఏడాదిలోనే కీర్తి సురేష్ పెళ్లి ఉంటుందంటూ కథనాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మరి 30 సంవత్సరాలు దాటాక కూడా ఇంకా సింగిల్ గానే ఉంటే.. ఇలాంటి పుకార్లే వినిపిస్తాయి కీర్తి. కాబట్టి.. ఇప్పటికైనా పెళ్లి పై సానుకూల నిర్ణయం త్వరగా తీసుకోక పోతే.. స్నేహితులు, సన్నిహితుల నుంచి వచ్చే వరుసపెట్టి ఎంక్వయిరీలకు వివరణ ఇచ్చుకోవడానికే సమయం సరిపోదు.

Also Read: పెళ్లికి ముగ్గురు హీరోలు సన్నాహాలు

- Advertisement -