మ్మ్.. కీర్తి సురేష్ మళ్లీ అతనికి ఓకే చెప్పింది !

87
- Advertisement -

లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు కీర్తి సురేష్ గత నాలుగేళ్ళ నుంచి కేరాఫ్ అడ్ర‌స్స్ అయిపోయింది. నిజానికి ఆమె న‌టించిన ఏ సోలో సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కాలేదు. ఆ మధ్య వచ్చిన ‘గుడ్ లాక్ సఖి’ ప్రేక్ష‌కులను భారీగా నిరాశ పరిచింది. మొత్తానికి కీర్తి సురేష్ సినిమాలకి వ‌సూళ్లు రాకపోయినా.. డిజిట‌ల్‌, శాటిలైట్ వ‌ల్ల‌… కొంత సేఫ్ ప్రాజెక్టుగా మిగిలిపోతున్నాయి. అందుకే.. ట్రేడ్ వ‌ర్గాలు కూడా కీర్తి సురేష్ సినిమాలను డిజాస్టర్లుగా తేల్చలేక పోతున్నాయి.

మొత్తమ్మీద అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు అన్నట్టు.. కీర్తి సురేష్ కెరీర్ కూడా అదృష్టం – దురదృష్టాలకు సంబధం లేకుండా సాగిపోతుంది. తాజాగా ఇప్పుడు కీర్తి సురేష్ కోసం మ‌రో లేడీ ఓరియెంటెడ్ క‌థ రెడీ అయిపోయింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఆల్రెడీ కీర్తి సురేష్ తో మిస్ ఇండియా అనే సినిమా తీసిన దర్శకుడు నరేంద్ర నాథ్ మళ్లీ ఓ లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ని రెడీ చేసుకొన్నాడు. ఆ మధ్య నయనతారకు కూడా ఓ నేరేష‌న్ ఇచ్చాడు. కానీ ఆమె పట్టించుకోలేదు.

ఇప్పుడు నరేంద్ర నాధ్ మ‌ళ్లీ ఆ క‌థ‌ని తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాడు. అయితే.. ఈసారి మొదట స‌మంత‌కు ఈ క‌థ చెప్పి ఒప్పిద్దాం అనుకొంటున్నాడు. స‌మంత‌ ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతుంది. అందుకే.. ఫైనల్ గా కీర్తి సురేష్ తోనే ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. నరేంద్ర నాధ్ కి – కీర్తి సురేష్ కి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్ద‌రూ మంచి ఫ్రెండ్స్‌. అందుకే, నరేంద్ర నాధ్ కి ఇప్పుడు మళ్లీ మరో ఛాన్స్ ఇవ్వాల‌ని కీర్తి సురేష్ భావిస్తోంద‌ట‌. అన్నీ కుదిరితే..త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -