వర్మపై కీరవాణి ప్రశంసలు..

296
Keeravani Praises ,Ram Gopal Varma,God Sex and Truth,Akkineni Nagarjuna,Music Director MM Keeravani,GST,Movie,Tollywood
- Advertisement -

ఒకవైపు అక్కినేని నాగార్జునతో సినిమా చేస్తూ.. మరోవైపు రామ్ గోపాల్ వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ లాంటి మూవీ తీస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. వర్మ ఈ టైంలో ఇలాంటి సినిమా తీయడమే ఆశ్చర్యమంటే దీనికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతాన్నందించడం ఇంకా పెద్ద షాక్. భక్తి రస.. ఆధ్యాత్మిక చిత్రాలకు మ్యూజిక్ చేయడం ద్వారా కీరవాణికి గొప్ప ఇమేజ్ వచ్చింది.

Keeravani Praises Ram Gopal Varma

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ)తో తన సంగీతాన్ని దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో మెట్టు ఎక్కించాడని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పొగడ్తలు కురిపించారు. సెల్యులాయిడ్ పై పలు రకాల భావాలను పలికించే ఆయన తెలివితేటలు తనతో 1991లో ‘రొమాన్స్’ను, 1992లో ‘కామెడీ’ని, 2018లో ‘సెక్స్’ను పలికించాయని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

ఇక ఈ సంవత్సరంలో ఆయన తీయనున్న హారర్, వయొలెన్స్ చిత్రాలకు సంగీతాన్ని అందించనున్నానని చెప్పారు. తనను నమ్మిన ఓ పిచ్చి సినీ దర్శకుడికి కృతజ్ఞతలని అన్నారు. కాగా, కీరవాణి చేసిన ఈ ట్వీట్ ను చూసిన తరువాత ‘థ్యాంక్స్ కీరూ’ అని వర్మ సమాధానం ఇచ్చాడు.

- Advertisement -