ఆర్ఆర్ఆర్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు..

61
- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌- ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ చిత్రం దాదాపు వెయ్యి కోట్లు రాబట్టగా ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది.

తాజాగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులో భారీ అవార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ పాటకి గాను అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.

మొదటి సారి AR రెహమాన్ స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొని మొదటి ఇండియన్ గా నిలవగా తాజాగా ఆర్ఆర్ఆర్‌తో ఇండియా నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న రెండో వ్యక్తిగా కీరవాణి రికార్డు సృష్టించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -