- Advertisement -
సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం నెలకొంది. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా మృతి చెందారు. మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి మరణించారు. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు శివశక్తి దత్తా సోదరుడు. పలు సినిమాలకు రైటర్‌గా వర్క్ చేశారు.
శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8వ తేదీన రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో ఆయన జన్మించారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం.. వారిలో కీరవాణి, కల్యాణి మాలిక్, శివ శ్రీ కంచి ఉన్నారు.
ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో శివశక్తి దత్తా అంత్యక్రియలు నిర్వహించను న్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read:TTD:కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు
- Advertisement -

