Kedarnath Temple: తొలి పూజలో ఉత్తరాఖండ్‌ సీఎం

23
- Advertisement -

ఉత్తరాఖండ్‌లోని కేదార్ నాథ్ ఆలయం తెరచుకుంది. సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు.

పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటి. శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసివేస్తారు. దాదాపు ఆరు నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయ తలుపులు భక్తుల దర్శనార్థం ఇవాళ తెరిచారు. ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టి కేదారేశ్వరుడిని దర్శించుకుంటున్నారు.చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నట్లు ఆల‌య క‌మిటీ చైర్మెన్ అజేంద్ర అజ‌య్ తెలిపారు.

Also Read:TTD:శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

- Advertisement -