“కేదార్‌నాథ్” టీజర్

282
- Advertisement -

సారా అలీ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “కేదార్‌నాథ్”.
2013లో కేదార్‌నాథ్‌లో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ కథ తెరకెక్కుతోంది. ఆర్ఎస్‌వీపీ మూవీస్
సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. ఏ విషాదం, ఏ విపత్తు, ఏ దేవుడు కూడా ప్రేమ శక్తిని వేరు
చేయలేరనే క్యాప్షన్ ఈ సినిమాకు ఇచ్చారు. షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలైంది. సారాను సుశాంత్ బుట్టలో ఎత్తుకెళ్తున్న
పోస్టర్ పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా మొత్తం కేదార్‌నాథ్‌లోనే రూపొందించినట్లు యూనిట్
సభ్యులు తెలిపారు. ఇక డిసెంబర్ లోగా అన్ని పనులు పూర్తి చేసి, అదే నెల 7వ తేదీన మూవీని
రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. తాగాజా విడుదలైన టీజర్ ప్రేకకులను ఆకట్టుకుంటోంది..

- Advertisement -