జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ లేఖ

6
- Advertisement -

జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరికి లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చారు కేసీఆర్.  నంది నగర్ నివాసం గోడపై నోటీసు అతికించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు కేసీఆర్.

65 ఏళ్లు దాటిన వారిని వారి నివాసం వద్దే విచారించాలని చట్టం చెబుతోందని గుర్తు చేసిన కేసీఆర్… తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని, అక్కడే విచారించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదని కేసీఆర్ వెల్లడించారు.  నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు.

సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ కేసు తీర్పును ఉటంకించిన కేసీఆర్… ఎన్నికల అఫిడవిట్ లోని చిరునామాకు, సెక్షన్ 160 నోటీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నివసిస్తున్న చోటే విచారణ జరపాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని వెల్లడించిందని.. హరీష్ రావు నోటీసుల విషయంలో పోలీసులు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని విమర్శించారు.

పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని హెచ్చరించిన కేసీఆర్… బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించారు.* ఫిబ్రవరి 1వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమని ప్రకటించిన కేసీఆర్…. నంది నగర్ నివాసంలోనే విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని…* భవిష్యత్తులో నోటీసులన్నీ ఎర్రవల్లి చిరునామాకే పంపాలని పోలీసులకు సూచించారు. ఏపీ హైకోర్టులోని ‘వీడీ మూర్తి’ కేసు తీర్పును లేఖలో ప్రస్తావించిన కేసీఆర్.. పోలీసుల చర్యలు తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -