కెసిఆర్ కు నోటీసులివ్వడమంటే కాంగ్రెస్ దివాళా కోరుతనమే అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కెసిఆర్ కు సిట్ విచారణ నోటీసుల విషయంలో కాంగ్రెస్ డ్రామాలను ఎండగడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం రేవంత్ రాక్షసానందానికి నిదర్శనం అన్నారు.
ఈ కేసులో కంప్లైంట్ దారులు లేరు.. నష్టపోయిన వారు లేరు..FIR లేకుండానే విచారణ పనికిమాలిన చర్య..కాంగ్రెస్, బీజేపీ రెండూ ఏకమై కెసిఆర్ పై విషం కక్కుతున్నారు..ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇటువంటి ఆరోపణలు వారికీ సహజమే ..కాంగ్రెస్ లో మంత్రులు, వారి కుటుంబ సభ్యుల ఆరోపణలను కప్పి పూచేందుకే ఈ విచారణ డ్రామాలు..బెదిరింపులు, రాసలీలలు అంటూ ఒకరిమీద ఒకరి ఆరోపణలు నిజం కాదా ..ఇది నిజంగా స్కీముల ప్రభుత్వం కాదు.. స్కాముల ప్రభుత్వం..
వాళ్ళ తప్పులకను కప్పి పుచ్చుకునేందుకే ఇటువంటి నోటీసులు..KTR, హరీష్, సంతోష్, ఇప్పుడు కెసిఆర్ పై విచారణ అంటూ హడావుడి చేస్తుండ్రు..
కాంగ్రెస్ మంత్రి గాంధీభవన్ సాక్షిగా అపార్టీ నేతలపై చేసిన ఆరోపణలు నిజం కాదా అన్నారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా నోటీసులు సరికాదు..అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసినట్లే మాట్లాడుతున్నరు..ఆత్మభిమానం చంపుకుని కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు..65 ఏండ్లు దాటితే.. వారు కోరిన చోటకే వెళ్లి విచారించాలని చట్టం స్పష్టంగా ఉంది..కెసిఆర్ నివాసం ఎర్రవెల్లి అనేది అందరికీ తెలిసిందే..
డీజీపీ, సీపీ, సిట్ అధికారులు ఎవరి వత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నరు..ఒక మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన నాయకుడు కెసిఆర్ కు నోటీసులు ఎప్పుడివ్వాలనేది అధికారులకు తెలువదా..మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలు..BRS పదేండ్ల అభివృద్ధిని.. కాంగ్రెస్ రెండేళ్లలో ఆగం చేసింది..స్మశానాలను ఫోటోలు దిగే కేంద్రాలుగా అభివృద్ధి చేసినం..పదేండ్ల అభివృద్ధిని చూసిన ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారు..మంచినీళ్లు, మురుగు కాలువలు, రోడ్లు, పార్కులు, లైట్లు, మినీ ట్యాంక్ బండ్ లు, ఇలా ఎనలేని అభివృద్ధి చేసినం.. జూరాల వద్ద క్రాప్ హాలిడే ప్రకటించడం దుర్మార్గం..BRS హయాంలో కళకళ లాడిన తెలంగాణ మళ్లీ కరువులో కురుకుపోయే పరిస్థితి..కాంగ్రెస్ పార్టీ ఎన్ని దొంగ వేశాలేసినా పట్టణ ప్రజలు BRS కే పట్టం కడతారు..చట్టాన్ని గౌరవించే నాయకుడుగా కెసిఆర్ సిట్ కు సహకరిస్తరు.. మీరడిగిన సమాచారమిస్తరు అన్నారు.

