కే‌సి‌ఆర్ తో ఢీ.. ఈటెల నిలిచేనా?

37
- Advertisement -

బలమైన వ్యక్తి తో పోటీ పడాలంటే ముందు మన బలం ఏంటో తెలిసుండాలి. బలాబలాలను అంచనా వేయకుండా బరిలోకి దిగితే పాతాళానికి పడిపోవడం తప్పా వేరే మార్గం కనిపించదు. ప్రస్తుతం బీజేపీ నేత ఈటెల వ్యవహార శైలి ఇలాగే ఉంది. బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీలో చేరిన ఆయన.. అప్పటి నుంచి అధినేత కే‌సి‌ఆర్ పై బురద చల్లుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారు. తనకు తానే గొప్ప చేసుకుంటూ ఆకాశానికి నిచ్చన వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈటెల కాన్ఫిడెన్స్ చూసిన బీజేపీ అధిష్టానం కూడా ఆహా..! ఓహో ! అంటూ చంకలు గుద్దుకుంటోంది. అయితే ఈటెల రాజేంద్రది.. కాన్ఫిడెన్స్ కాదు ఓవర్ కాన్ఫిఏడెన్స్ అనేది యావత్ రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పుడో తెలిసిన విషయం.

సి‌ఎం కు పోటీగా తాను బరిలోకి దిగుతానని, కే‌సి‌ఆర్ ను ఒడిస్తానని పగటి కలలుకంటూ కమలనాథులకు లేనిపోని ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈటెల కోరికకు తగినట్లుగానే ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో గజ్వేల్ నుంచి కే‌సి‌ఆర్ కు పోటీగా ఈటెల రాజేందర్ ను నిలబెట్టింది బీజేపీ. కే‌సి‌ఆర్ పోటీని తట్టుకుని ఈటెల నిలిచేనా ? ఇంతకీ ఈటెల రాజేందర్ కు అంతా సామర్థ్యం ఉందా అంటే ? అబ్బే అవన్నీ ఉత్తుత్తి మాటలే అని కొట్టి పారేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్ బరిలో నిలిచిన కే‌సి‌ఆర్.. అఖండ మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో అసలు కే‌సి‌ఆర్ కు ప్రత్యర్థి ఎవరనేది కూడా చాలా మంది ప్రజలకు తెలియని విషయం. అంతటి ప్రజాధరణ ఉన్న నేతను ఢీ కొట్టి నిలవడం అంతా తేలికైన విషయం కాదు. దానికి తోడు కే‌సి‌ఆర్ సు పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 100 కు పైగా సీట్లు సాధిస్తుందని సర్వేలు ఇప్పటికే తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ కు పోటీగా నిలిచే ప్రత్యర్థులేవరైనా కనుమరుగవ్వడం ఖాయమనే చెప్పాలి.

Also Read:#Nani31..అప్‌డేట్

- Advertisement -