- Advertisement -
రేపు తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిధ్దం చేశారు ఎన్నికల అధికారులు. ఏజెన్సీ ప్రాంతాలు మినహా అన్ని ప్రాంతాల్లో ఉదయం 7గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32,815 పోలీంగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు అధికారులు. ఈనెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని అధికారులు తరలిస్తున్నారు.
ఈ నేపధ్యంలో సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలోని పోలింగ్ బూత్ లో సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రేపు కేసీఆర్ అక్కడికి వెళ్లి వస్తుండంతో హెలిప్యాడ్ స్ధలాన్ని పోలింగ్ బూత్ ను పోలీస్ అధికారులు ఇవాళ పరిశీలించారు. పోలీంగ్ బూత్ ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు.
- Advertisement -