BRS ఆవిర్భావం.. పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం

6
- Advertisement -

తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో కీలక భూమిక పోషించిన భారత రాష్ట్ర సమితి (BRS) నేడు మరో మైలురాయిని అధిగమిస్తోంది. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుని, నేడు 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రజతోత్సవ సంబరాలు మిన్నంటుతున్నాయి.

హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ రజతోత్సవ వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గులాబీ తోరణాలు, పార్టీ జెండాలతో భవన్ పరిసరాలు వెలిగిపోతున్నాయి. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం నుంచే వేడుకలు ప్రారంభం కానున్నాయి: ఉదయం 11 గంటలకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఎగరవేస్తారు. గ్రామగ్రామాన పార్టీ జెండాను ఎగరవేసి, సంబరాలు జరుపుకోవాలని పార్టీ అధిష్టానం కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కే. చంద్రశేఖర రావు (KCR) తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు,జిల్లా పార్టీ అధ్యక్షులు,మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు హాజరుకానున్నారు.

Also Read:వాలా Ⅱ..హౌస్‌ఫుల్ రన్!

ఈ సమావేశంలో గత పాతికేళ్ల పార్టీ ప్రస్థానం, తెలంగాణ సాధనలో పోషించిన పాత్ర, పదేళ్ల పాలనలో సాధించిన విజయాలపై కేసీఆర్ ప్రసంగించనున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరియు భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు, నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ అస్థిత్వం కోసం పుట్టిన పార్టీ, నేడు జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక చారిత్రక ఘట్టం..రజతోత్సవ వేళ బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివస్తుండటంతో తెలంగాణ భవన్ వద్ద సందడి నెలకొంది.

- Advertisement -