ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 24 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెల 24న భువనేశ్వర్‌లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు,లక్ష్యాల గురించి చర్చిస్తారు.
అనంతరం అక్కడి నుంచి పూరికి వెళ్లి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శిస్తారు. తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ప్రధాని మోడీతో భేటీకి సీఎం సమయం కోరారు. ఖరారైన వెంటనే సీఎం ఒడిశాకు వెళ్లే అవకాశముంది. తన పర్యటనలో భాగంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయవతితో సమావేశం కానున్నారు.
ఈనెల 23న విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శిస్తారు. ఇటీవల రాజ శ్యామల యాగం నిర్వహించిన శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు.
బీజేపీ,కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలతో చర్చలు జరిపిన కేసీఆర్ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే విధంగా అడుగులు వేయనున్నారు.