శారదపీఠం వార్షికోత్సవాలకు సీఎం కేసీఆర్..!

528
kcr saradapetam
- Advertisement -

సీఎం కేసీఆర్ మరోసారి ఏపీకి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 10 నుండి 14 వరకు విశాఖలో జరిగే శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. 14వ తేదీ చివరి రోజు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఇప్పటికే శారద పీఠం కేసీఆర్‌ను ఆహ్వానించింది.

శృంగేరి శారదాపీఠం సంప్రదాయం ప్రకారం ఐదు రోజుల పాటు కేసీఆర్ యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొన్నారు. సహస్రచండీయాగంలో భాగంగా తొలిరోజు వంద, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 వందల సప్తశతి పారాయణాలు చేశారు. ఐదో రోజున 11 హోమగుండాల వద్ద ఒక్కో గుండానికి 11 మంది రుత్వికులు చొప్పున 100 పారాయణాల స్వాహాకారాలతో హోమం నిర్వహించారు.

Image result for kcr sharada peetham

అంతకముందు ఎన్నికల్లో విజయం సాధించాలని కేసీఆర్ శారదాపీఠం ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వత విశాఖలోని శారదాపీఠానికి వెళ్లి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.తాజాగా మరోసారి కేసీఆర్ ఏపీ టూర్‌కి వెళ్లనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -