దూకుడు పెంచిన కేసీఆర్‌..

196
KCR To Address Husnabad Public Meeting on Sep 7th
- Advertisement -

సీఎం కేసీఆర్‌ ఇప్పుడు రాజకీయ వ్యూహరచనలో బిజీ అయ్యారు. ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్‌ నుంచి ఫామ్‌హౌజ్‌ కు చేరుకున్నారు.

కాగా..ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సంబంధించి ప్రతీ అంశాన్ని దృష్టిలోపెట్టుకొని ఒక్కొక్క లాంఛనాన్ని పూర్తి చేస్తూ వచ్చారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌ సమావేశం, అసెంబ్లీ రద్దుపై పార్టీ సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

ఇదిలా ఉండగా..ప్రస్తుత సమాచారం ప్రకారం 6వ తేదీన రాష్ట్ర కేబినెట్‌ సమావేశమయ్యే అవకాశం ఉంది. మరో వైపు 7న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భారీ బహిరంగసభ నిర్వహించే యోచనలో టీఆర్ఎస్ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రులకు కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం. కాగా..సెప్టెంబర్‌ 2న నిర్వహించిన భారీ బహిరంగసభకు జనం భారీగా తరలివచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -