కేసీ‌ఆర్ తో డిబేట్ చేసే సత్తా బీజేపీకి ఉందా ?

55
- Advertisement -

ప్రస్తుతం దేశంలోని అన్నీ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా రంగాల్లో ముందు వరుసలో ఉంది. అటు అభివృద్ది లోనూ ఇటు సంక్షేమంలోనూ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ అందిస్తున్న మెరుగైన పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అమలౌతున్న దళితబంధు, ఉచిత కరెంట్, వంటి ఆయా పథకాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఇక ఎన్నో భారీ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర నిలయంగా ఉంది.

దాంతో ప్రస్తుతం దేశమంత కూడా తెలంగాణ వైపు చూస్తోందంటే ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ చేస్తున్న సుపరిపాలన కరణంగానే దేశ ప్రజలు తెలంగాణ మోడల్ కు ఆకర్షితులౌతున్నారు. ఇక ప్రస్తుతం దేశంలోని అన్నీ వైపులా నుంచి కూడా బి‌ఆర్‌ఎస్ కు మద్దతు భారీగా పెరుగుతోంది. విపక్ష పార్టీలోని కీలక నేతలు కే‌సి‌ఆర్ తో కలిసి నడిచేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ కు దేశ వ్యాప్తంగా లభిస్తున్న ఆధరణ కమలనాథులు జీర్ణించుకోలేక పోతున్నారనే చెప్పాలి. దాంతో కే‌సి‌ఆర్ పాలనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నప్పటికి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.

కాగా కే‌సి‌ఆర్ సుపరిపాలనను ఓర్వలేక విమర్శలు గుప్పించే బీజేపీ ఎమ్మెల్యేలకు బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టులా ఉన్నాయి. వనరుల విషయంలోనూ, రాష్ట్ర అభివృద్ది విషయంలోనూ కే‌సి‌ఆర్ తో డిబేట్ లో పోల్గొనే సత్తా బీజేపీ నేతలకు ఉందా అంటూ సవాల్ విసిరారు దానం నాగేందర్. డిబేట్ లో కే‌సి‌ఆర్ ఒక్కటైన తప్పుచేబితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీలోని ఏ మేధావి అయిన చర్చలో పాల్గొన వచ్చని, చర్చకు బీజేపీ రెడీగా ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం దానం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి…

JAGAN:జగన్ సైలెంట్.. ఆ భయంవల్లేనా ?

TELANGANA:లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో గ్రీన్ ఇండియా…

గెల్లు శ్రీనివాస్ యాదవ్ బయోడేటా…

- Advertisement -