కేసీఆర్‌ ఒక ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ : కేటీఆర్

79
ktr book
- Advertisement -

తెలంగాణ గోసలను తన గోసలుగా భావించి అమరణ నిరహారదీక్షకు ప్రతీన బూని తెలంగాణ సాధించిన… సీఎం కేసీఆర్‌ జీవితాన్ని ఈ పుస్తక రూపంలో అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు రచయిత, ఫిలిం డైరెక్టర్‌ మనోహర్‌ చిమ్మ. కేసీఆర్‌ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకోసం ప్రయత్నించిన వాళ్లలో ఒకరన్నారు మనోహర్‌ చిమ్మ. ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ చేతులమీదుగా కేసీఆర్ – ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, స్వర్ణసుధ పబ్లికేషన్స్ అధినేత పరమేశ్వర్ రెడ్డి బైరి, తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరక్టర్‌ దితీప్‌ కొణతం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత 60 ఏండ్లుగా ఎవ‌రూ సాధించ‌ని తెలంగాణ‌ను కేసీఆర్ సాధించారు. తెలంగాణ సాధన ఆశయం కోసం ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ ఢిల్లీలో ప్రతిఒక్కరిని కలుపుకొనిపోయార‌ని గుర్తు చేశారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో ప్ర‌ణాళిక‌లు ర‌చించి, తన శక్తియుక్తులన్నీ ధారపోశార‌ని కొనియాడారు. చివరికి ఆమరణ నిరాహారదీక్ష కూడా చేశారు. అందరూ రాదు రాదు అన్న తెలంగాణను తెచ్చి చూపించారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రపంచంలోనే అతిపెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను రికార్డ్ టైంలో నిర్మించారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ‌ను నంబ‌ర్ వ‌న్‌గా నిలిపార‌ని తెలిపారు. ఇంత చేస్తున్నా కేసీఆర్‌ను కొందరు దూషిస్తున్నారు. అనరాని మాటలంటున్నారు. ఇలాంటి సమయంలో మనోహర్ చిమ్మని లాంటి రచయిత శ్రమించి కేసీఆర్ మీద ఒక మంచి పుస్తకం తీసుకురావడం నిజంగా హర్షణీయమన్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకాన్ని నేను తప్పకుండా చదువుతాను. నా అభిప్రాయాన్ని, రివ్యూను ట్వీట్ చేస్తాన‌ని కేటీఆర్ తెలిపారు.

- Advertisement -