తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు కేసీఆర్. టీఆర్ఎస్‌ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ ఇవాళ రాజ్‌భవన్‌లో గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్‌తో పాటు
మరొకరు మంత్రిగా ప్రమాణం చేస్తారని సమాచారం.
వారం రోజుల తర్వాత పూర్తిస్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఉండనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆశావాహులు తమజోరు పెంచారు. ఇక పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్సీ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి మరోసారి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ఎల్పీ భేటీ తర్వాత సీఎం కేసీఆర్, మంత్రులు ఆపద్ధర్మ పదవులకు రాజీనామా చేశారు. ఈ లేఖలను ఎంపీ వినోద్‌కుమార్ గవర్నర్‌కు అందజేశారు. ఆయన వాటిని ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు సీఎంగా కొనసాగాలని గవర్నర్ కేసీఆర్‌కు సూచించారు. మొత్తంగా కేసీఆర్ మంత్రివర్గంలో ఛాన్స్ ఎవరుదక్కించుకుంటారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.