మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో బిఆర్‌ఎస్ అక్కడ బలపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను కాదని అక్కడి ప్రజలు బిఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ బిఆర్‌ఎస్ ఎంత వేగంగా బలపడుతుందనే సంగతి. ఇటీవల ఆ రాష్ట్రంలో కేసిఆర్ ఏ బహిరంగ సభ నిర్వహించిన భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతూ మద్దతు పలుకుతున్నారు. ఇంకా ఇతర పార్టీల నేతలు కూడా బిఆర్‌ఎస్ లో చేరేందుకు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. ఎప్పటికే ఎంతో మంది నేతలు బిఆర్‌ఎస్ గూటికి చేరారు..
Also Read:ములుగుకు కేటీఆర్..అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రస్తుతం బిఆర్‌ఎస్ లో కొనసాగుతున్న చేరికలు.. అక్కడ అధికారంలో ఉన్నశివసేన షిండే వర్గంలో గుబులు పుట్టిస్తోంది. షిండే వర్గానికి చెందిన దాదాపు 150 మంది బిఆర్‌ఎస్ లో చేరేందుకు సిద్దమౌతున్నారనే వార్త ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే గనుక జరిగితే అటు బీజేపీకి ఇటు షిండే వర్గానికి గట్టి దేబ్బే అని చెప్పాలి. గత ఏడాది ఉద్దవ్ థాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ సహాయంతో ఏక్ నాథ్ షిండే అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ కు పెరుగుతున్న ఆధారణ చూస్తే షిండే ప్రభుత్వం ఎంతో కాలం నిలవదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన వంటి పార్టీలు బిఆర్‌ఎస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వచ్చేలా కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే బిఆర్‌ఎస్ గ్రామస్థాయిలో విస్తరించడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం. ఇదిలాగే కొనసాగితే మహారాష్ట్రలోని ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తూ బిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పవచ్చు.
Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే