KCR:సింగరేణిని కాపాడాలంటే బీఆర్ఎస్ గెలవాలి

20
- Advertisement -

సింగరేణిని కాపాడాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు మాజీ సీఎం కేసీఆర్. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఆత్మహత్యులు చేసుకుంటున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రామగుండం రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్…కాంగ్రెస్,బీజేపీలు ఒక్కటై తనపై బ్యాన్ పెట్టారన్నారు. బ్యాన్ ఉంది కాబట్టి రాత్రి 8.15 గంటల తర్వాత వచ్చానని తెలిపారు.

అమిత్ షా దేవుడి బొమ్మలు నెత్తిమీద పెట్టుకుని మాట్లాడుతున్న ఎన్నికల కమిషన్‌కి కనిపించడం లేదన్నారు.చేనేత కార్మికులు పాపుడాలు, నిరోధ్‌లు అమ్ముకోవాలని కాంగ్రెస్ నేతలు మాట్లాడితే కోపంతో ఓ మాట అన్నానని చెప్పారు.

రైతు బంధు లేదు, కళ్యాణ లక్ష్మీ అమలు కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే అక్కడ దేవుడి మీద ఒట్లు పెడుతూ గోల్ మాల్ చేస్తున్నారన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా?ఆలోచించాలన్నారు. కేసీఆర్ బస్సుయాత్రతో కాంగ్రెస్,బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. తులం బంగారం తుస్సుమంది అన్నారు. ఐదు నెలల కింద పరిస్థితులు ఎలా ఉన్నాయి..?ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచించాలన్నారు. పొలాలు ఎండిపోవడానికి కారణం ఎవరో ఆలోచించాలన్నారు. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. సింగరేణిని నష్టాల్లోకి నెట్టి కేంద్రానికి అప్పజెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ అన్నారు.

కృష్ణా నది వాటాను కేఆర్ఎంబీకి అప్పజెప్పిండు, గోదావరి నీళ్లను తరలిస్తామని మోడీ అంటే సప్పుడు చేయడం లేదన్నారు.ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోవడం లేదన్నారు.అదానీకి గేట్లు తెరచి దోచుకోమని సంతకాలు పెట్టిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కాగానే సింగరేణిని నాశనం చేస్తారని ఆరోపించారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారం అన్నారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చామన్నారు. కొప్పుల ఈశ్వర్ గెలిస్తే సింగరేణి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.

Also Read:BRS:ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేశ్ రెడ్డి

- Advertisement -