దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్రయత్నాలు జరగడాన్ని మనమంతా చూస్తున్నమన్న సీఎం కేసీఆర్… ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గోని ప్రసగించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయినప్పటికీ.. పేదల ఆశలు నెరవేరలేదు.. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదనే ఆవేదన మనకు కనబడుతుందన్నారు. మౌనం వహించడం సరికాదు. అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్ని అయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తారో ఆ సమాజం గొప్పగా పురోగమించే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
సామూహిక జాతీయ గీతాలాపన చేయాలంటే సుమారు కోటి మంది పాల్గొన్నారు. ఏకకాలంలో ఆలపించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని సీఎం పేర్కొన్నారు. మహాత్ముడు విశ్వమానవుడు. కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారు. ఆయన గొప్పతనాన్ని యూఎన్‌వో ప్రశంసించింది. అంతర్జాతీయంగా ఏ దేశానికి వెళ్లిన ఇండియా అంటే యూ ఆర్ గ్రేట్ అని పొగడ్తల వర్షం కురిపిస్తుంటూరు. గాంధీ గారి జీవిత విశేషాలు, విగ్రహాలు.. విదేశాల్లో ఉన్నాయంటే భారతదేశానికి గర్వకారణం అని చెప్పారు. ఏ విధంగా పురోగమిస్తున్నామో మనకు తెలుసు.
ప్రాణ, ఆస్తి త్యాగాలు, అమూల్యమైన జీవితాలు త్యాగం చేస్తే, ఎన్నో బలిదానాలు చేస్తే ఈ స్వాతంత్య్రం వచ్చింది. స్వేచ్ఛా భారతంలో స్వేఛ్చా వాయువులు పీలుస్తున్నాం. 75 ఏండ్లుగా జరుగుతున్న విషయాలను మరోసారి సింహవలోకనం చేసుకోని ముందుకు పురోగమించాల్సినటువంటి పద్ధతులను ఆలోచించుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది. ఈ దేశాన్ని స్వేచ్ఛా వాయువులతో ఉండే విధంగా.. స్వతంత్ర దేశంగా మార్చేందుకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. వారందరికీ శిరస్సు వంచి వినమ్రపూర్వకంగా జోహార్లు ఆర్పిస్తున్నాను. ఘన నివాళులర్పిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
పేదల ఆశలు నెరవేరడటం లేదు. అట్టఅడుగు వర్గాల ప్రజల్లో ఆక్రోశం ఇంకా వినిపిస్తుంది. అనేక వర్గాల ప్రజలు తమకు స్వతంత్ర ఫలాలు సంపూర్ణంగా అందట్లేదని ఆవేదన మనకు కనబడుతుందని కేసీఆర్ తెలిపారు. అద్భుతమైన ప్రకృతి సంపదతో, ఖనిజ సంపదతో యుశక్తితో, మానవసంపత్తితో ఉన్న ఈ దేశం పురోగమించడం లేదు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో ఉజ్వలమైన రీతిలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరిపై ఉంది. ఈ క్రమంలోనే ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించుకున్నాం. చాలా గొప్పగా కార్యక్రమాలు నిర్వహించిన అందరికీ, అలరించిన కళాకారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.