KCR:నల్గొండ సభతోనే పోరాటం ఆగదు

27
- Advertisement -

నీళ్లు లేకుంటే తెలంగాణ బతుకు లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. నల్గొండ జిల్లాలో జలహక్కుల కోసం జంగ్ సైరన్ సభలో మాట్లాడిన కేసీఆర్..ఇది రాజకీయ సభ కాదని ఉద్యమ పోరాట సభ అన్నారు. 24 ఏండ్లుగా పక్షిలా తిరుగుతూ చెబుతున్న నీళ్లు లేకుంటే తెలంగాణ లేదన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ఫ్లోరోసిస్ లేకుండా చేశామన్నారు.ఆనాడు రాష్ట్రం కోసం కోట్లాడామన్నారు. ఉద్యమ సమయంలో పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయేననే పాట నేనే రాశానని తెలిపారు. ఇవాళ ఒక్క పిలుపుతో ఈ సభకు తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

పదేళ్లపాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపామన్నారు కేసీఆర్. ముఖ్యంగా నీటికోసం రాజీలేని పోరాటం చేశామన్నారు.నీటి వాటా కోసం సుప్రీం కోర్టుకు పోయామని తెలిపిన కేసీఆర్..ట్రైబ్యునల్‌లో ఇంకా పంచాయతీ తేల్చలేదన్నారు.సాగు నీటి కోసం లోక్ సభను స్తంభింపజేశామన్నారు.జీవితాల్ని దెబ్బ కొట్టే సాగునీటిని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉండే ఇప్పుడు బాగాలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.తెలంగాణ హక్కుల కోసం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఛలో నల్గొండ పిలుపుతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చిందన్నారు.కాంగ్రెస్ నేతలకు పదవులు, పైరవీలు తప్ప ప్రజల బాధలు పట్టవన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఒక్కటన్న మంచి పని ఉందా ఆలోచించాలన్నారు. కేసీఆర్‌ని తిట్టడమే కాంగ్రెస్ నేతల పని అన్నారు.అధికారం ఎవరికి శాశ్వతం కాదని హక్కులు మాత్రమే శాశ్వతమన్నారు. బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తంగా ఉండాలని..హక్కుల కోసం పోరాడాలన్నారు. కేసీఆర్ హయాంలో 24 గంటల కరెంట్ ఇచ్చామని…కానీ ఇవాళ దద్దమ్మ రాజ్యంలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. ఛలో నల్గొండతోనే ఈ పోరాటం ఆపమని..ఎక్కడికక్కడా కాంగ్రెస్ నేతలను నిలదీస్తామన్నారు. కరెంట్‌ను పునరుద్దరించి రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతు బంధు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ నేతలకు ఛాత కావడం లేదన్నారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామన్న కాంగ్రెస్ నేతలవి కండ కావరం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పంటలు పండించే రైతులకు చెప్పులు ఉంటాయని..వాటితో బుద్ది చెప్పే పరిస్థితి వస్తుందన్నారు.

Also Read:ప‌న‌స పండ్లు ఎక్కువ‌గా తింటున్నారా?

- Advertisement -