నిజామాబాద్ బీజేపీ బహిరంగ సభలో తనపై మోడీ చేసిన ఆరోపణలన్ని అబద్దాలేనని మండిపడ్డారు సీఎం కేసీఆర్. మోడీ ఇంత తెలివి తక్కువ ప్రధానమంత్రి అనుకోలేదని ఎవరో రాసిచ్చిన అబద్దాలను తెల్సుకోకుండా చదివారని ఎద్దేవా చేశారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణలో కరెంట్ సమస్య ఉందని మోడీ చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.
నాకు యాగాలు, పూజలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ప్రధాని మోదీ అన్నారు..నాకు భక్తి ఉంది. దేవున్ని నమ్ముతా. నీకు భక్తి ఉంటే నువ్వు కూడా ఇక్కడికి రా తీర్థం పోస్తానని సీఎం కేసీఆర్ సూచించారు. నేను పూజలు చేసుకుంటే మోదీ ముల్లె ఏం పోయిందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.
నిజామాబాద్ లో కరెంట్, నీళ్లకు జనం ఇబ్బందులు పడుతున్నారని విమర్శించిన మోడీకి.. కేసీఆర్ సవాల్ విసిరారు. రమ్మంటే వెంటనే నిజామాబాద్ వస్తా … ఇద్దరం కలిసి బహిరంగ సభ పెడదాం. అదే సభలో … అక్కడ కరెంట్, నీళ్ల సమస్య ఉందా అని అడుగుదాం. జనం ఏం చెబుతారో చూద్దాం.. సరేనా అని సవాల్ విసిరారు.
ఒక్క కేసీఆర్‌ను కొట్టడానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, చంద్రబాబు ఏకమయ్యారని… ఈ దేశంలో ఇద్దరు దరిద్రులు పోవాలే. రాష్ట్రాలతో కలిపి వచ్చే ఫెడరల్ ఫ్రంట్ రావాలన్నారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పనిచేస్తాయని చెప్పారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్ రెండూ కూడా కల్తీలేని పక్కా తెలంగాణ పార్టీలని చెప్పారు. కేంద్రంలో మతగజ్జి ఉన్న ప్రభుత్వం ఉందన్నారు. తాను ఎవరికీ భయపడనని చెప్పారు కేసీఆర్.