KCR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

19
- Advertisement -

రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందన్నారు మాజీ సీఎం కేసీఆర్. వర్షం కురిసిన ఇంతమంది వచ్చారు మీకందరికీ ధన్యవాదాలు అని తెలిపారు . మెదక్ రోడ్డు షోలో పాల్గొని ప్రసంగించిన కేసీఆర్..చైతన్యవంతమైన మెదక్ లో మీరు మంచి తీర్పు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటిలతో అరచేతిలో వైకుంఠం చూపించింది..అనేక వాగ్దానాలు చేసి అబద్దాలతో అధికారంలోకి వచ్చారన్నారు. ఉచిత బస్సుతో మహిళలు కోటుకుంటున్నారు…ఆటో కార్మికులు రోడ్డున పడ్డారు,రైతు బంధు డబ్బులు అందరికి వచ్చాయా..పాత పథకాలు కూడా సరిగా అమలు చేయడం లేదు అన్నారు.

గతంలో 30 వేల కోట్లు రుణమాఫీ చేశాం,సీఎం రేవంత్ చెప్పిన 2 లక్షల ఋణమాఫీ జరిగిందా ఆలోచించాలన్నారు.ఆగమాగం జగన్నాథం కావద్దు,గోదావరి మాయమైతే మన రాష్ట్ర గతి ఏం కావాలి,కర్ణాటక, తమిళనాడు కి తరలిపోతే మన పరిస్థితి ఏంటి…? ,తెలంగాణ ఉద్యమంలో నన్ను మీరు అందరూ దీవించారు,మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నమి ఓటేశారు,మళ్ళీ తెలంగాణ నిలబడాలంటే BRS గెలవాలన్నారు.

బీజేపీ అభ్యర్థి నోటికి ఎదివస్తే అదే మాట్లాడుతారు,మోడీ ది గ్యాస్… రఘునందన్ ది గ్యాస్,నేను ఇదే జిల్లా బిడ్డను..మీ కోసం ఏం చేశానో మీకు తెలుసు,నేనే వెంకట్రామిరెడ్డి ని మెదక్ నుంచి నిలబడాలని చెప్పాను,BRS హయాంలో ఉన్న స్కీములు అమలు కావడం లేదు,సీఎం రేవంత్ మెదక్ జిల్లాని తీసేసెటట్టు ఉన్నారు,
మెదక్ జిల్లా ఉండాలంటే BRS ఎంపీ అభ్యర్థి గెలవాలన్నారు. నేను మెదక్ జిల్లా వాడినే కాబట్టి ఈ జిల్లాని అభివృద్ధి చేసుకున్నాము,100 పడకల ఆస్పత్రి మెదక్ కి ఇస్తే దానిని 50 పడకలకు కుదించింది కాంగ్రెస్ అన్నారు.

ఏడు పాయల కోసం 100 కోట్లు ఇస్తే వెనక్కి తీసుకువెళ్లిపోయారు,పాత ప్రభుత్వంలో ఇచ్చిన మంజూరులన్ని ఆపేశారన్నారు. ప్రధాని మోడీ పదేళ్ల కింద అధికారంలోకి వచ్చి 150 హామీలు ఇచ్చారు,సబ్ కా సాత్ సబ్ కా వికాస్, 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు.. మోడీ హయాంలో జరిగిందా,కాంగ్రెస్ ఇస్తానన్న 4 వేల పెన్షన్ వచ్చిందా..నిరుద్యోగ భృతి వచ్చిందా,మోడీ గోదావరి నదిని తమిళనాడు కి అప్పచెబ్బుతాను అంటున్నారు,కృష్ణా నదిని KRMB కి అప్పచెప్పారు,తొమ్మిది ఏళ్లపాటు నేను ఒక్క నిమిషం కరెంట్ పోకుండా ఇస్తే వీళ్లకు చేత కావడం లేదు అని దుయ్యబట్టారు.

Also Read:KCR:తెలంగాణపై మోడీ సవతి తల్లి ప్రేమ?

- Advertisement -