KCR:కే‌సి‌ఆర్ ‘వ్యూహం’.. రెడీ!

24
- Advertisement -

లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారా ? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు బెడిసి కొట్టినప్పటికీ.. మెజారిటీ ప్రజలు బి‌ఆర్‌ఎస్ కే మద్దతుగా నిలవడంతో ఇక లోక్ సభ ఎన్నికల్లో రెట్టించిన జోష్ చూపించాలని అధినేత కే‌సి‌ఆర్ పట్టుదలగా ఉన్నారు. కేంద్రంలో అధికారాన్ని డిసైడ్ చేయడంలో లోక్ సభ ఎన్నికలు కీలకమైనవి కావడంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో 10-15 స్థానాల్లో సత్తా చాటే విధంగా కే‌సి‌ఆర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నేతలతో పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు కే‌సి‌ఆర్. ఈ సమావేశంలో బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేశవ రావు, నామ నాగేశ్వరరావు వంటి వారితో పాటు ఎంపీలు అందరూ కూడా హాజరయ్యారు.

ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటే విధంగా అందరూ కృషి చేయాలని కే‌సి‌ఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇకపోతే గత పార్లమెంట్ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 3, కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 స్థానాలను గెలుచుకున్నాయి. కాగా ఈసారి గతంలో కంటే మెరుగ్గా ఫలితాలు రాబట్టేందుకు అభ్యర్థుల ఎంపికలో కే‌సి‌ఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేపడుతూనే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ల విషయంలో కూడా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న అధినేత.. ప్రస్తుతం మళ్ళీ యాక్టివ్ కావడంతో పార్టీ నేతల్లో ఫుల్ జోష్ నెలకొంది. మరి ముందు ఎన్నికలే లక్ష్యంగా కే‌సి‌ఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

Also Read:Harish:అత్యాధునిక టెక్నాలజీతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ

- Advertisement -