- Advertisement -
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ చేరుకున్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్లో త్రివేండ్రం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది.
తెలుగు సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో త్రివేండ్రంలో కేరళ సీఎం పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. కేరళ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రామేశ్వరం, శ్రీరంగం దేశాలయాలను సందర్శిస్తారు.
ఈ నెల 13న తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ తో భేటీ కానున్నారు. దేశ రాజకీయాలతో పాటు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రాంతీయ పార్టీలు కీలకంకానున్నాయని వివరించనున్నారు సీఎం కేసీఆర్.
- Advertisement -