కేసీఆర్ ప్రజాయోధుడు..పుస్తకావిష్కరణ

8
- Advertisement -

కేసీఆర్ ప్రజా యోధుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆమట్లాడిన కేటీఆర్… కేసీఆర్ అప్పులు చేశాడంటూ తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ సాక్షిగా చెప్పు దెబ్బలు కొట్టారు…పార్లమెంట్‌లో కేసీఆర్ హయాంలో జరిగిన అప్పు కేవలం రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు వారసత్వంగా వచ్చిన అప్పు కలిపితే రూ.3.50 లక్షల కోట్లు అని నివేదిక ఇచ్చారు.కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వాన్ని నడపడం చేతకాక, కేసీఆర్‌ పై అభాండాలు వేస్తున్నారు అన్నారు.

కరోనా సమయంలో రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా, ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదు. హైదరాబాద్‌లో రోడ్ల దగ్గరినుంచి రైతుబంధు, కల్యాణలక్ష్మి, పెన్షన్లు, ధాన్యం కొనుగోలు ఏదీ ఆగలేదు. సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టే ఆదాయం లేకపోయినా సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించాం అన్నారు.

తలసరి ఆదాయంలో దేశంలో 12వ స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా?,నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు” అన్న అపనమ్మకాన్ని పోగొట్టి, ఆడబిడ్డలు సర్కారు దవాఖానాల్లో కేసీఆర్ కిట్లు తీసుకొని పండంటి బిడ్డలకు జన్మనిచ్చిన సంగతి వాస్తవం కాదా?,మాతా శిశు మరణాలను తగ్గించి ఆరోగ్య రంగంలో 14వ స్థానం నుంచి మూడో స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా? చెప్పాలన్నారు. ఐటీ రంగం, పరిశ్రమలు, వ్యవసాయం, ఆరోగ్యం.. ఇలా ఏ రంగం తీసుకున్నా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించింది….కేసీఆర్ అప్పులు చేశాడంటూ తప్పుడు కూతలు కూసిన కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ సాక్షిగా చెంప దెబ్బలాంటి సమాధానాన్ని కేంద్రం ఇచ్చింది అన్నారు.

Also Read:బాలికపై హత్యాచారం..రెండు ఉరిశిక్షలు!

- Advertisement -