చిరు,వెంకయ్యకు కేసీఆర్ అభినందనలు

28
- Advertisement -

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులు దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజా సంస్కృతికి ప్రతీక చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య కు భారత ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేసారు.

ఇది తెలంగాణ సాంస్కృతిక జీవనానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. తర తరాలుగా తెలంగాణ జన జీవితాల్లో భాగోతం” పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానం అని కేసీఆర్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతికోద్యమంలో ఈ కళారూపం కళాకారులు భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు

జనగామ ప్రాంతానికి చెందిన గడ్డం సమ్మయ్య గారి తొ పాటు పద్మశ్రీ అవార్డు కు ఎంపికయిన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజన కారులు… బుర్ర వీణ కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ళ విఠలాచార్య గార్లను కేసీఆర్ అభినందించారు.
వారికి శుభాకాంక్షలు తెలిపారు.

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
సర్వసత్తాక గణతంత్ర దేశంగా ప్రజాస్వామ్య భారత్ ఆవిర్భవించి 75 ఏండ్లవుతున్నదని, భవిష్యత్తులో మన దేశం అన్ని రంగాల్లో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
నేత

- Advertisement -