తనపై పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలేవి అని మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తన ఎన్నికల ప్రచారానికి 48 గంటల పాటు నిషేదం విధించిన ఈసీ…సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి నా పేగులు మెడలో వేసుకుంటా ,గుడ్లు పీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే.. ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.. రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు.. లక్షలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, బీఆర్ఎస్ బిడ్డలంతా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పని చేస్తారని తెలిపారు.
మోడీ మన గోదావరిని ఎత్తుకపోతా అంటుంటే ముఖ్యమంత్రి ముడుసుకొని కూర్చున్నారు. ఎనిమిదేళ్లు నడిచిన కరెంట్, నీళ్ళు ఎక్కడ పోయాయి. నా ప్రాణం ఉన్నంతవరకు రాష్ట్రాన్ని ఆగం కానివ్వను అని తెలిపారు కేసీఆర్.
Also Read:TTD:వేదాలు విజ్ఞాన భాండాగారాలు