నందమూరి హరికృష్ణ మరణవార్త విని ఆయన భౌతిక ఖాయాన్ని దర్శించడానికి వెళ్లిన కేసీఆర్, హరికృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం మహా ప్రస్థానం లో హరికృష్ణ అంత్యక్రియలు జరుగుతున్నాయి.2 గంటలు ప్రాంతంలో హరికృష్ణ స్వగృహం నుండి ఆయన భౌతికదేహాన్ని బయటికి తీసుకు వచ్చారు. ఏపీ సీ.ఎం చంద్రబాబు నాయుడు, మాజీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి వైకుంఠ , హరికృష్ణ భౌతికఖాయాన్ని వాహనం వరకు మోశారు. మెహదీపట్నం, రేతి బౌలి ,షేక్ పేట్ నాలా , విస్ఫర్ వ్యాలీ మీదుగా చైతన్య రథం పై హరికృష్ణ పార్థివదేహం మహా ప్రస్థానం కు చేరింది.
కాగా హరికృష్ణ ఆఖరి మజిలీని చేరుకునేందుకు ఎటువంటి ఆటంకం కలగకూడదని, కేసీఆర్ ప్రభుత్వం హరికృష్ణ అంతిమ ప్రయాణం జరిగే మార్గానికి ఆంక్షలు విధించింది. మధ్యాన్నం 3 గంటలనుండి 6 గంటల వరకు ఆ ప్రయాణ మార్గం లో వెళ్ళవలసిన వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల నుండి వెళ్ళవలసిందిగా తెలియజేసింది. వాహనదారులు జజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్ మీదుగా వెళ్లాలని సూచనలు చేశారు. గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలను ఫిల్మ్‌నగర్ మీదుగా మళ్లించారు.