- Advertisement -
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇదివరకే తెలిసిన విషయం. అయితే తాజాగా కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి స్వయంగా ప్రకటించారు.
ఈ ప్రకటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది మన కేసీఆర్ అని స్పష్టం చేశారు. మేం తెగించి కొట్లాడాం కాబట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. కేసీఆర్ దెబ్బ అంటే ఎట్లా ఉంటందో ఇప్పుడు కేంద్రం రుచి చూసిందని అన్నారు.
ఇవి కూడా చదవండి…
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: జేడీ
సీఎం కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది :తోట
KAVITHA:అతనెవరో నాకు తెలియదు: కవిత
- Advertisement -