ఒకే వేదికపై సీఎంలు కేసీఆర్,జగన్

111
kcr jagan
- Advertisement -

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్,జగన్‌లు ఒకే వేదికను పంచుకున్నారు. ఆదివారం తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలి వివాహం, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడితో శంషాబాద్‌లోని వీఎంఆర్ గార్డెన్‌లో జరిగింది. ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

ఇద్దరు పక్క పక్కన కూర్చొని మాట్లాడుకున్నారు. వధూవరులను ఆశీర్వదించిన సీఎంలు అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవడం ఇదే తొలిసారి.

ఇక ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్… వరి కొనుగోళ్లు, ఢిల్లీ రైతు ఉద్యమంలో పాల్గొన్నవారికి నష్టపరిహారం అందించడం.. వంటి అంశాలపై కేంద్రపెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది.

- Advertisement -