కేసీఆర్ కిట్‌కు శ్రీకారం

261
Kcr Kit Launched
- Advertisement -

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లీ బిడ్డలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా  ప్రభుత్వం తీసుకువచ్చిన ‘కేసీఆర్‌ కిట్‌’ పథకం  రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.  పాతబస్తీలోని పేట్లబుర్జు ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. మేకల సవిత, రషీదా బేగం, నవనీత, మెహజెబీన్‌, సరిత, తబస్సుమ్‌ అనే ఆరుగురు బాలింతలకు కేసీఆర్‌ స్వయంగా కిట్లు అందజేశారు.

అంతకు ముందు ఆయన ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులు వైద్యులతో ఆయన మాట్లాడారు. అక్కడి వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు స్ధానిక ప్రజాప్రతినిధులు  ఉన్నారు.

Kcr Kit Launched
కాన్పు జరిగిన తర్వాత 16 వస్తువులతో కూడిన ఈ కిట్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆడపిల్ల పుడితే రూ.13,000, మగబిడ్డ పుడితే రూ.12,000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ మొత్తాన్ని దశల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తుంది.

మొద‌టి విడ‌త న‌గ‌దు: ప‌్ర‌భుత్వాసుప‌త్రిలో గ‌ర్భిణిగా పేరు న‌మోదు చేయించుకుని క‌నీసం రెండు సార్లు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్న త‌రువాత రూ. 3వేలు అంద‌జేస్తారు.
రెండో విడ‌త న‌గ‌దు: ప‌్ర‌భుత్వాసుప‌త్రిలో ప్ర‌స‌వించిన త‌రువాత ఆడ‌బిడ్డ పుడితే రూ.5వేలు, మ‌గ బిడ్డ పుడితే రూ. 4వేలు అంద‌జేస్తారు.
మూడో విడ‌త న‌గ‌దు: బిడ్డ పుట్టిన‌ప్పటి నుంచి మూడున్న‌ర నెల‌ల కాలంలో ఇవ్వ‌వ‌ల‌సిన టీకాలు తీసుకున్న త‌రువాత రూ. రెండు వేలు
నాలుగో విడ‌త న‌గ‌దు: బిడ్డ పుట్టిన‌ప్ప‌టి నుంచి 9 నెల‌ల కాలంలో ఇవ్వ వ‌ల‌సిన టీకాలు తీసుకున్న త‌రువాత రూ. మూడు వేలు ఇస్తారు. ఈ నాలుగు విడ‌త‌లుగా ఇచ్చే మొత్తం న‌గ‌దు బిడ్డ త‌ల్లి పేరుపై ఉన్న బ్యాంకు అకౌంట్లో జ‌మ అవుతాయి.

KCR kits to be distributed today

- Advertisement -