బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్..

195
kcr budget
- Advertisement -

ఎన్నో అంచనాలు, మరెన్నో ఊహాగానాలు వాటన్నింటిని పటాపంచలు చేస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు సీఎం కేసీఆర్. వీరవిధేయులు,అనుభవం ప్రాతిపదికన మంత్రివర్గ విస్తరణ చేపట్టిన సీఎం మంత్రుల శాఖల కేటాయింపులోనూ తన మార్క్‌ చూపించారు. టీఆర్‌ఎస్‌ కీలక నేతలైన కేటీఆర్, హరీశ్‌ రావులు నిర్వహించిన పురపాలక, పరిశ్రమలు, ఐటీ, సాగునీటి పారుదల శాఖలతోపాటు కీలకమైన ఆర్థిక, రెవెన్యూ, విద్యుత్‌ శాఖలను కేసీఆర్‌ ఎవరికీ కేటాయించలేదు.

ఇక మంత్రులకు శాఖల కేటాయింపుపై రకరకాల ప్రచారం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రిగా నిరంజన్‌ రెడ్డికి బాధ్యతలు అప్పజెబుతారని ప్రచారం జరిగిన వ్యవసాయ శాఖను ఆయనకు కేటాయించారు. ఈటలకు వైద్య, ఆరోగ్య శాఖను కేటాయించారు. ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ యాదవ్‌కు గత కేబినెట్‌లోని మంత్రిత్వ శాఖలే ఇచ్చారు.

గురువారం కొత్త కేబినెట్‌ భేటీ కానుండగా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఫిబ్రవరి 22న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు సీఎం కేసీఆర్.సీఎం బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాదు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం రోశయ్య ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించనున్నారు కేసీఆర్.

ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ 2 లక్షల కోట్ల రూపాయలతో ఉండనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు సంక్షేమం,సాగునీటి ప్రాజెక్టులు వంటి అంశాలకు పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది.

- Advertisement -