జెంటిల్‌మెన్ కాంబినేషన్‌ మరోసారి..!

244
nani indraganti
- Advertisement -

టాలీవుడ్ విజయవంతమైన కాంబినేషన్‌లలో హీరో నాని-ఇంద్రగంటి మోహనకృష్ణ జోడి ఒకటి. వీరి కాంబినేషన్‌లో అష్టాచమ్మా,జెంటిల్‌మెన్‌ సినిమాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. తాజాగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. ప్రస్తుతం నాని జెర్సీతో పాటు మనం ఫేమ్‌ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలు పూర్తయిన వెంటనే నాని-ఇంద్రగంటి కాంబినేషన్‌ సెట్స్‌పైకి వెళ్లనుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా మరో హీరో కూడా ఈ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలో సినిమాకు సంబంధించి అఫిషియల్‌ అనౌన్స్‌ వెలువడనుంది.

ప్రస్తుతం గౌతమ్ నన్నూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ సినిమాతో బిజీగా ఉన్నారు నాని. నానిని సరసన శ్రద్ధ శ్రీనాత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా అల్‌రెడీ సెట్స్‌పైకి వెళ్లింది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా వరుస సినిమాలో 2019లో అలరించేందుకు సిద్ధమయ్యాడు నాని.

- Advertisement -