BRS: కే‌సి‌ఆర్.. కదన’భేరి’!

32
- Advertisement -

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారాన్ని వేగవంతం చేసే దిశగా ప్రతిపక్ష బి‌ఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నేడు కరీంనగర్ వేదికగా కదనభేరి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ సభ కు అధినేత కే‌సి‌ఆర్ హాజరు కానున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసినప్పటికి.. తెలంగాణ ప్రజల్లో బి‌ఆర్‌ఎస్ స్థానం సుస్థిరంగానే ఉంది. అందువల్ల లోక్ సభ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ సత్తా చాటే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. .

గత లోక్ సభ ఎన్నికల్లో 9 స్థానాల్లో విజయం సాధించిన బి‌ఆర్‌ఎస్.. ఈసారి అంతకు మించి అనేలా ఎన్నికలకు సిద్దమైంది. ఇప్పటికే తొలి జాబితాలో భాగంగా నాలుగు స్థానాల్లో అగ్యర్థులను ఫైనల్ చేసింది అధిష్టానం. త్వరలోనే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా అధినేత కే‌సి‌ఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై పై మూడు నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఇచ్చిన హామీలను పరిమితి మేర అమలు చేస్తుండడం, తీవ్రమైన కరెంటు కొరత, నీటి కొరత.. ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలానే సమస్యలు చుట్టుముట్టాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలన తీరుపై అధినేత కే‌సి‌ఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పాలనపై దృష్టి పెట్టకుండా తరచు కాళేశ్వరం అంశాన్ని తెరపైకి తెస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఆ మద్య కే‌సి‌ఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక నేడు జరిగే కదనభేరి సభలో కూడా కాంగ్రెస్ పాలకులపై కే‌సి‌ఆర్ మరోసారి ఫైర్ అయ్యే అవకాశం ఉంది. ఆరు గ్యారెంటీల అమలులో లోపాలు, కాంగ్రెస్ బాధ్యతరహిత పాలన, వంటి అంశాలపై కే‌సి‌ఆర్ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. మొత్తానికి అధినేత ఎన్నికల ప్రచారానికి తెర తీయడంతో ప్రత్యర్థి పార్టీలలో కొంత కలవరం మొదలైందనే టాక్ వినిపిస్తోంది.

Also Read:గంగా ఎంటర్‌టైన్మెంట్స్..’శివం భజే’

- Advertisement -