కే‌సి‌ఆర్ పిల్లి కాదు.. పులి !

20
- Advertisement -

కృష్ణ జలాల పరిరక్షణ కోసం బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ ఛలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి బహిరంగ సభ కావడంతో వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆరోగ్య రీత్యా కే‌సి‌ఆర్ బలహీన పడ్డారని, ఆయన ఇంకా రాజకీయాలకు విరామం తీసుకోవాల్సిందే అని విమర్శించే వాళ్ళకు చెంపపెట్టులా కే‌సి‌ఆర్ నిలిచారు. కాంగ్రెస్ పాలకులపై పాలన విధానంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కే‌సి‌ఆర్ ను బద్నామ్ చేయాలని చూసిన పరవలేదని కానీ తెలంగాణ ప్రజలను బద్నామ్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.

కృష్ణా జలాలపై జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజా క్షేత్రంలొనే తేల్చుకునేందుకు ఛలో నల్గొండ సభ నిర్వహించినట్లు చెప్పుకొచ్చారు. .అసెంబ్లీలో బడ్జెట్ గురించి మాట్లాడకుండా తీర్మానం పెట్టి ముగించారని మండిపడ్డారు. కట్టే కాలే వరకు తెలంగాణ కోసం పోరాడతానని, రాష్ట్రానికి అన్యాయం జరిగితే పులిలా కొట్లాడతానే తప్పా పిల్లిలా వెనకడుగు వేయనని గట్టిగా హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు కోతలు మొదలయ్యాయని, అసెంబ్లీలో కూడా జనరేటర్ ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అని కొందరు అంటున్నారని, అదే చెప్పులు రైతుల వద్ద కూడా ఉన్నాయని ఇష్టానుసారంగా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

గత పదేళ్ళలో జరిగిన అభివృద్ది కంటే ఇంకా మెరుగైన అభివృద్ది చేయాలిగాని కే‌సి‌ఆర్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తే ఉరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని, ఇప్పుడు ఓడిపోయిన మళ్ళీ మూడింతలు బలంతో అధికారంలోకి వస్తామని అధినేత కే‌సి‌ఆర్ వ్యాఖ్యానించారు. ఓవరాల్ గా ఛలో నల్గొండ సభలో కే‌సి‌ఆర్ వ్యాఖ్యలు బి‌ఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ ను నింపడంతో పాటు ప్రజలకు దైర్యా న్నిచ్చాయి.

Also Read:Raviteja:రవితేజ హిట్ ట్రాక్ ఎక్కేనా?

- Advertisement -