- Advertisement -
టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ను ఎన్నుకోగా ఆ తీర్మానాన్ని కేసీఆర్…గవర్నర్‌కు అందజేయనున్నారు.
రేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ముఖ్యమంత్రిగా రెండోసారి కేసీఆర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగనుంది. అయితే ప్రొటెం స్పీకర్‌గా రెడ్యా నాయక్‌ను నియమించాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో 18 మందికి అవకాశం దక్కనుండగా కేసీఆర్‌తో పాటు ఎంతమంది మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారనేది సస్పెన్స్‌గా మారింది.
- Advertisement -