టీఆర్ఎస్ పార్టీ త్వరలోనే బీఆర్‌ఎస్‌గా మార్పు చేందుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో బీఆర్‌ఎస్ శాఖలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో సిడ్నీలో బీఆర్‌ఎస్ శాఖ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. ఈ సమావేశం లో సభ్యులు వెంకట రమణ రెడ్డి మర్రి, రవీందర్ చింతామణి, పరశురామ్ ముతుకుల ,కిషోర్ బెందే, లక్ష్మణ నల్ల, రాహుల్ రాంపల్లీ, సాంబ శివ మల్గారి, మొహమ్మద్ ఇస్మాయిల్, మొహమ్మద్ ఏజాజ్, భోజి రెడ్డి, మధు కలం, ప్రవీణ్ జంబుల, నిఖిల్ గడ్డమీద తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా మాట్లాడుతూ… ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ జాతీయ రాజకీయాల గురించి చర్చ వచ్చిన ఎన్నారైలు అందరూ బీఆర్‌ఎస్ గురించి చర్చిస్తున్నారు. ఆస్ట్రేలియాలో చూసుకుంటే అందరూ కేసీఆర్ నాయకత్వములో దేశం ముందుకు వెళ్తుంది. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరిస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశములో వున్నా అన్ని వనరులను సరిగ్గా ఉపయోగించుకొని దేశాన్ని ముందు వరసలో ఉంచడం కేసీఆర్‌కే సాధ్యమన్నారు. తెలంగాణనే కాకుండా మిగతా రాష్ట్రాల వారు కూడా బీఆర్‌ఎస్ కు మద్దతు తెలుపుతున్నారు. టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా కార్యవర్గానికి బీఆర్‌ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలను చేరువ చేసిందని సూచించారు .ఇక మునుగోడు విషయానికి వస్తే తెరాస బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడం కాయం అన్నారు.
బీజేపీ తన సొంత ప్రయోజనాల కోసం మునుగోడు ప్రజల అభిమానాన్ని తాకట్టు పెట్టి ఈ ఉపఎన్నిక తీసుకొచ్చారని మండిపడ్డారు. ఒక కాంట్రాక్టర్ తన సొంత లబ్ది కోసం ఉపఎన్నిక తెచ్చి ఇప్పుడు అందరి పైభారం వేస్తున్నారు. తెరాస చేసిన సంక్షేమ పనులే మునుగోడులో విజయం సాధించిపెడుతుందని అన్నారు . ఇక రాబోయే రోజులల్లో బీజేపీ పార్టీ కాళీ కావడం కాయం అన్నారు. సాధారణ ఎలక్షన్స్ ముందే బీజేపీ డీలా పడిపోతుందని అన్నారు. మునుగోడు లో ప్రజలందరూ గత ఎనిమిది సంవ్సరాలుగా తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమంపై విశ్లేషణ చేసి టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని, దేశమంతా ఇప్పుడు మునుగోడు వైపే చూస్తుందని ప్రజలు విజ్ఞత తో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ సురభి వాణి మాట్లాడుతూ…విదేశాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ పై ఎన్నారైలు చూపిస్తున్న అమితమైన ప్రేమ గొప్పదని , దీనికి వెలకట్టలేమని ఆనందం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ…గుణాత్మక మార్పుకై జాతీయ రాజకీయాలలోకి కేసీఆర్ రావాల్సిన ఆవశ్యకత గురించి ఎన్నారైలు ముక్తకంఠంతో కేసీఆర్‌ను దేశ రాజకీయాలలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మునుగోడుకు సీఎం..మాస్టర్ ప్లాన్
నోట్లపై దేవుళ్ల బొమ్మలు ఉండాల్సిందే
కాంగ్రెస్ చీఫ్‌గా ఖర్గే..బాధ్యతలు స్వీకరణ