KCR:హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ..

9
- Advertisement -

కేసీఆర్‌ అంటేనే ఓ చరిత్ర అని, దానిని ఎవరూ తుడిపేయలేరని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ స్పష్టం చేశారు. టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కేసీఆర్…తన పేరును లేకుండా చేయడం అంటే తెలంగాణ లేనట్టేనన్నారు. కేసీఆర్‌ని లేకుండా చేయాలనే ఆలోచన దుర్మార్గం అన్నారు.

కేసీఆర్‌ ఈజ్‌ హిస్టరీ ఆఫ్‌ తెలంగాణ. నో బడీ కెన్‌ వైప్‌ ఇట్‌. కేసీఆర్‌ను తగ్గిద్దామని చాలామంది, చాలా ప్రయత్నాలు చేసి, భంగపడి విఫలమయ్యారు. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగాను. నన్ను తగ్గించడం అంటూ ఉండదు. ఇది కాంగ్రెస్‌, బీజేపీ ఆడుతున్న ఒక రాజకీయ వికృత క్రీడ దీని వెనుక ముఖ్యమంత్రి, ఆయనను ఎన్నుకున్న ముఠా ఉందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతో ప్రజలు టెంప్ట్‌ అవడంతో వాళ్లకు మాకంటే 1.8 శాతం ఎక్కువ ఓట్లు వేయడం ద్వారా అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రజలు గాయపడ్డారు. రైతాంగం విలవిలలాడుతున్నది. ఏ కోణంలోనూ పరిస్థితులు సరిగా లేవు. ఇప్పుడు రాష్ట్రంలో దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్‌ మీద తిట్లు మాత్రమే నడుస్తుందన్నారు.

కేసీఆర్‌ ఒక వ్యక్తి కాదు. ఒక ఇన్‌స్టిట్యూషన్‌. శూన్యంలో నుంచి సునామీ సృష్టించా. దిక్కుతోచని పరిస్థితిలో మన బతుకులు ఇక ఇంతేనా అన్నట్టు ఉన్న తెలంగాణ ప్రజల కోసం స్వయంగా ఒక పార్టీని స్థాపించి, ఆ పార్టీని ఒక మహా సుడిగాలిగా, మహోధృతమైన ఉద్యమ రూపంలో నడిపి, అనుకున్న లక్ష్యాన్ని సాధించా. తదనంతరం పదేండ్లు కులం, మతం, జాతి, వివక్ష లేకుండా పాలించా. రాజకీయ నాయకులు కొన్ని విషయాలను ప్రజల్లోకి ప్రబలంగా తీసుకుపోవాలనుకున్నప్పుడు కొంత ఉద్వేగంతో, వ్యంగ్యంతో మాట్లాడుతారు. అలా ఆ రోజుల్లో సమైక్య వాదులు నామీద చేసే దాడికి ప్రతిగా కొంత వ్యంగ్యం కూడా కలిపి మాట్లాడేవాడిని. చాలామంది నేను ఆంధ్రాప్రాంత వ్యక్తులకు వ్యతిరేకం అని అనుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

Also Read:TTD:వైభవంగా ముగిసిన తెప్పోత్సవాలు

- Advertisement -