ఆపదలో ఎవరున్నా సరే ఆదుకునేందుకు ముందుండే సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆయనిచ్చిన హామీ మేరకు, మంత్రి హరీశ్ రావు కొండపాకకు వెళ్లి, దొమ్మాటికి రూ. 25 లక్షల సాయాన్ని, డబుల్ బెడ్ రూం ఇల్లును అందించారు. ఇటీవల కొండపాక మాజీ ఎమ్మెల్యే దొమ్మాట రామచంద్రారెడ్డికి ఆర్థిక సహాయం చేస్తానని మాటిచ్చిన సంగతి తెలిసిందే.
ఐదు రోజుల క్రితం కొండపాకలో కురుమలకు గొర్రెలను పంపిణీ చేసిన కార్యక్రమం జరుగగా, అక్కడికి వచ్చిన రామచంద్రారెడ్డి, తన అనారోగ్యం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి కేసీఆర్ కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను అప్యాయంగా పలుకరించిన కేసీఆర్.. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం పద అన్నా అంటూ వెంట తీసుకెళ్లారు. అయితే.. తాను మందులు వేసుకోలేదని ఇప్పుడు తినలేదని చెప్పారు. కలెక్టర్ ను పిలిచి ఇంటి స్థలం కేటాయించాలని చెప్పటంతో పాటు.. ఏ అవసరం వచ్చినా.. ఈ తమ్ముడు ఉన్నాడని మరవకండి అంటూ ఆయనకు ధైర్యం చెప్పారు. అంతేకాదు.. వెళ్లే ముందు వదినమ్మను అడిగినట్లు చెప్పండన్నా అంటూ అప్యాయతను ప్రదర్శించిన కేసీఆర్ వైనానికి రామచంద్రారెడ్డి విపరీతమైన ఆనందానికి గురయ్యారు.