రాణిగా కాజల్‌ చేస్తుందా..?

228
- Advertisement -

హిందీలో ఘన విజయం సాధించిన ‘క్వీన్‌’ సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేయాలనే విషయం గత కొన్నాళ్లుగా నానుతోంది. తెలుగు, తమిళ వెర్షన్లకు ఎవరిని తీసుకోవాలా? అన్న విషయం ఓ పట్టాన తేలడం లేదు. కొంతమందిని సంప్రదించినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఆఖరికి ఆ పాత్ర చేయడానికి తమన్నా ఒప్పుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో మళ్లీ నాయిక కోసం అన్వేషణ మొదటికొచ్చింది. ఈ క్రమంలో ఈ సినిమా చేయడానికి కాజల్ అగర్వాల్ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని తాజాగా తనే వెల్లడించింది.

Kajal confirmed for Tamil Queen

అయితే తాజాగా..”ఈ క్వీన్ పాత్ర చేయాలని వుంది. నిర్మాతలు కూడా నన్ను సంప్రదించారు. చేయడానికి ఒప్పుకున్నాను. అయితే, ఇంకా డీల్ కుదరలేదు. చర్చలు జరుగుతున్నాయి. ఏమైనా, ఈ పాత్ర చేసే అవకాశం రావడం మాత్రం నాకు ఆనందంగా వుంది” అని చెప్పింది అమ్మడు. అయితే, పారితోషికం దగ్గరే చర్చలు ఆగాయని, ఈ ముద్దుగుమ్మ పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తోందని సమాచారం. ఈ లోగా నిర్మాతల మధ్య కూడా కొత్త వివాదం తలెత్తిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజక్టు ఎప్పటికి పట్టాలు ఎక్కుతుందో చూడాలి.

తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి నటుడు, దర్శకుడు రమేశ్‌ అరవింద్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్‌.. కెరీర్‌లో మంచి స్థితిలో ఉన్నారు. తెలుగులో చిరంజీవి కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌ ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత రానా జోడీగా ఆమె చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు తెరకు ‘లక్ష్మీ కల్యాణం’ ద్వారా ఆమెను పరిచయం చేసిన తేజ.. ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే తన తొలి చిత్ర కథానాయకుడు కల్యాణ్‌రామ్‌తో ‘ఎమ్మెల్యే’లోనూ ఆమె నటిస్తున్నారు. ఇవి కాక తమిళంలో అజిత్‌, విజయ్‌ వంటి అగ్ర నటులతో సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ‘క్వీన్‌’ సౌత్‌ రీమేక్‌.. ఆమెకు మరింత పేరు తీసుకువచ్చే అవకాశాలున్నాయి.

- Advertisement -