KCR:ఆట ఆరంభం..కే‌సి‌ఆర్ ఎంట్రీ!

39
- Advertisement -

దాదాపు రెండు నెలల విరామం తరువాత బి‌ఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ తెలంగాణ భవన్ లో అడుగు పెట్టారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రమాదవశాత్తు బాత్రూమ్ లో జారిపడ్డారు. తుంటి ఎముక విరుగగా.. సర్జరీ చేయించుకున్న ఆయన అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటూ ఇటీవలే కోలుకున్నారు. ఆ మద్య బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. పూర్తిగా కోలుకొని తాజాగా తెలంగాణ భవన్ లో అధినేత అడుగు పెట్టడంతో బి‌ఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆనందం వెళ్లువిరిసింది. ఇక రానున్న అసెంబ్లీ సమావేశాలకు కే‌సి‌ఆర్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

ఎందుకంటే అలివిగాని హామీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నప్పటికి లబ్దిదారులకు పరిమితులు విధిస్తూండడంతో కాంగ్రెస్ సర్కార్ పై కొంతమేర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేధికగా కాంగ్రెస్ సర్కార్ పై అధినేత కే‌సి‌ఆర్ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారనేది అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. పైగా కే‌సి‌ఆర్ వాక్ధాటి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తన పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కే‌సి‌ఆర్.. ఇక ప్రతిపక్షంలో మరింత పదునుగా వ్యవహరించడం ఖాయం. ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని, ప్రజా గొంతుకగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అధినేత ఇప్పటికే పలు మార్లు చెప్పుకొచ్చారు. మరి కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలు, ఈ రెండు నెలల్లో అనుసరించిన విధానాలపై కే‌సి‌ఆర్ సంధించే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా సమాధానం చెబుతుందో చూడాలి.

Also Read:పిక్ టాక్ : అందాల దుమారంతో ప్రగ్యా

- Advertisement -