ఢిల్లీలో సీఎం కేసీఆర్..

188
KCR FOR DELHI TO ATTEND NEETI AYOG MEET
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలికారు. ఆదివారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ మూడవ పరిపాలక మండలి సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నీతి ఆయోగ్ చైర్మన్ హోదాలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న పలు సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చిస్తారని అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, నగదు రహిత లావాదేవీలు తదితర పలు కీలకఅంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. 2030 విజన్ డాక్యుమెంట్‌పై చర్చ జరగనున్న ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోడీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన ముస్లింలను ఆదుకోవడంతోపాటు వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై మోదీకి వివరించనున్నారు. కాగా, ఢిల్లీ చేరుకున్న కేసీఆర్‌కు విమానాశ్రయంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలికారు.

- Advertisement -