తెలంగాణ‌ను ఏమైనా అంటే ఊరుకోను :కేసీఆర్‌

240
KCR fires on amit shah
KCR fires on amit shah
- Advertisement -

భార‌తీయ జ‌నతా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా చేసిన ప‌లు వ్యాఖ్య‌ల‌ప‌ట్ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఆయ‌న ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ” గత సంవత్సరం సెప్టెంబర్‌లో అమిత్‌ షా తెలంగాణకు వచ్చారు. దేశంలో నెం.1గా ఉన్న రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గత పర్యటనలో రూ. 90 వేల కోట్లు ఇచ్చామని అమిత్ షా చెప్పారు. పట్టించుకోకుండా వదిలేశాం. వాస్తవాలు ప్రజలకు తెలుసు.. ఈ సారి మూడు రోజుల పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంపై వరుస విమర్శలు చేస్తున్నాడు. తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రమన్నఅందరికి తెలిసిందే. అన్నీ రంగాల్లో ఇతర రాష్ట్రాల్లో పోటీ పడుతుంది.. దేశంలోని రాష్ట్రాలతోనే కాదు.. ప్రపంచంతోనే పోటీ పడుతోంది.

KCR2

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఎన్నో దేశాల రాయబారులు  తెలంగాణ పథకాలను మెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా అమిత్‌ షా.. నన్ను ఏమన్నా పడతా.. కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించ పరిచే   విధంగా రాష్ట్ర అభివృద్దిని కుంటు పరిచే విధంగా మాట్లడితే ప్రాణం పోయినా ఊరుకునేది లేదు.. ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. అవినీతి లేకుండా.. క్రమశిక్షణ… నిబద్దతతొ పనిచేస్తున్న ప్రభుత్వం మాది.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సాధించనటువంటి టార్గెట్‌లను తెలంగాణ సాధిస్తున్నది. ఇది నేను చెప్పడం కాదు.. ప్రధాని మోడీతో సహ అనేక మంది కేంద్రమంత్రులు, తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వాల అధికారులు, మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యుల బృందాలు వచ్చి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, టీఎస్ ఐపాస్‌ లాంటి కార్యక్రమాలను ప్రశంసించారు.

మిషన్ కాకతీయకు సంబంధించి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే రాజేంద్ర సింగ్‌లు వచ్చి తెలంగాణలో ఒక చెరువు కట్టమీద పుట్టిన రోజు జరుపుకున్న ఘటనలు సాక్ష్యం. కేంద్ర మంత్రి ఉమాభారతి కూడా తెలంగాణ మోడల్‌ను కాపీ కొట్టండని 29 రాష్ట్రాలకు సూచించిందన్న సంగతి అందరికీ తెలిసిందే. తన సొంత రాష్ట్రం బుందేల్‌ ఖండ్లో తెలంగాణ మోడల్‌ను అమలు చేస్తున్నానని అధికారికంగా ఉమభారతి ప్రకటించారు. నీతి ఆయోగ్ మీటింగ్‌ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా లాంటి వాళ్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని పొగుడుతుంటే.. అమిత్‌ షా అందుకు విరుద్దంగా.. దుర్మార్గంగా మాట్లడిండు. అయితే స్థానికంగా రాసిచ్చిండ్రా.. లేదా ఆయన సొంత కవిత్వాలా.. కానీ అద్బుతమైన అబద్దాలు చెబుతున్నాడు అమిత్ షా.” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

amit

అమిత్ షా ఘోరమైన త‌ప్పు ఒక‌టి మాట్లాడార‌ని, ప్ర‌తి ఏటా తెలంగాణ‌కు అద‌నంగా 20 వేల కోట్ల రూపాయ‌లు ఇస్తున్న‌ట్లు ప‌లు వ్యాఖ్య‌లు చేశారని చెప్పారు. ‘అమిత్ షాకి నేను చాలెంజ్ చేస్తున్నాను.. అద‌నంగా 200 రూపాయ‌ల కోట్లయినా ఇచ్చారా? ఇస్తే చెప్పండి’ అని కేసీఆర్ అన్నారు. గౌర‌వం ఇస్తే గౌర‌వం పుచ్చుకుంటారని అన్నారు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి వెళ్లిపోతే ఒక ముఖ్యమంత్రిగా నేనెలా ఊరుకుంటా? అని అన్నారు. కేంద్రానికి ప‌న్నుల కింద‌ తెలంగాణ ప్రభుత్వం వేల కోట్ల రూపాయ‌లు చెల్లించుకుంద‌ని తెలిపారు. రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం 63,790 మాత్ర‌మే ఇచ్చింద‌ని వివ‌రించారు. కేంద్ర ప‌న్నుల్లో వాటాల కింద ఈ మూడు ఏళ్ల‌లో రాష్ట్రానికి 37,773 కోట్లు వ‌చ్చాయ‌ని చెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు తెలంగాణ‌కు రూ.18,574 కోట్లు వ‌చ్చాయ‌ని కేసీఆర్ అన్నారు. జాతీయ ర‌హదారుల కింద ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రానికి 2,055 కోట్లు మంజూరు అయ్యాయని, ఇవ్వి కేంద్రమే ఖ‌ర్చు పెడుతుంద‌ని అన్నారు. విభ‌జ‌న చ‌ట్టం కింద రూ.1,016 కోట్లు మాత్రమే రెండు వాయిదాలుగా కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ ఇచ్చింద‌ని, ఏపీకి మాత్రం ఇప్ప‌టికి మూడుసార్లు ఇచ్చింద‌ని తెలిపారు. ఫైనాన్స్ క‌మిష‌న్ ఫండ్స్ 5,160 కోట్లు వ‌చ్చాయని అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ‌కు రూ.1,200 కోట్ల పై చికులు సీఎస్‌టీ బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు.

- Advertisement -