నామినేషన్ దాఖలు చేసిన సీఎం కేసీఆర్..

228
KCR
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గజ్వేల్ ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్..మధ్యాహ్నం 2.34 గంటలకు నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు.

అంతకముందు ఉదయం ఎర్రవెల్లి వ్యవయసాయ క్షేత్రం నుంచి నంగునూరు మండలంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న కేసీఆర్ నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడిన కేసీఆర్ …టీఆర్ఎస్ వందసీట్లలో గెలుస్తుందని  తెలిపారు.

Image result for KCR files Nomination

వెంకన్న దయవల్ల వచ్చే ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందని, ఆ ప్రాజెక్టు నుంచి వచ్చే నీటితో స్వామి పాదాలు కడుగుతామని తెలిపారు. తాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మూలాలు ఇక్కడే ఉంటాయన్నారు. హరీష్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

1985 నుంచి కేసీఆర్ నామినేషన్ వేసే ముందు కోనాయిపల్లి వెంకటేశ్వరుడుని దర్శంచుకుంటున్నారు. స్వామి వారి పాదాల చెంత నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం సమయంలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -