కే‌సి‌ఆర్ ఎంట్రీ.. కాంగ్రెస్ కు సినిమా స్టార్ట్?

26
- Advertisement -

బి‌ఆర్‌ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఇక ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆరోగ్య రీత్యా ఆయన కొన్ని రోజులు బెట్ రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు. అయినప్పటికి బి‌ఆర్‌ఎస్ తరుపున కే‌సి‌ఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రతిపక్ష బాద్యతలతో అందరి దృష్టిని ఆకర్షించారు. అధికార కాంగ్రెస్ చేసే విమర్శలకు ధీటైన సమాధానం ఇస్తూ తమ వైఖరి ఎలా ఉండబోతుందో చెప్పాకనే చెప్పారు. ఇక వచ్చే నెలలో తొలి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కే‌సి‌ఆర్ అసెంబ్లీలో అడుగు పెట్టె అవకాశం ఉంది. .

ఈనేపథ్యంలో ముందు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా చూపిస్తామని బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ట్రైలర్ మాత్రమే చూసిందని, కే‌సి‌ఆర్ ఎంట్రీతో అసలు సినిమా మొదలౌతుందని కే‌టి‌ఆర్ తనదైన రీతిలో చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటి అమలు విషయంలో ప్రస్తుతం కాంగ్రెస్ వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే ఇచ్చిన హామీల అమలు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన సహించబోమని, వాటి అమలుకై పోరాటం చేస్తామని కే‌టి‌ఆర్ స్పష్టం చేశారు. ఇక ముందు రోజుల్లో అసెంబ్లీ వేధికగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో కే‌సి‌ఆర్ ప్రజాగొంతుకగా నిలిచే అవకాశం ఉంది. మరి కే‌సి‌ఆర్ ను కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

Also Read:అబద్ధాల ముందు ‘అభివృద్ధి డీలా’ !

- Advertisement -