29,30న కేసీఆర్ ప్రచార షెడ్యూల్..

192
kcr elections tour
- Advertisement -

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది దూకుడు పెంచారు సీఎం కేసీఆర్. ఇప్పటికే 40 నియోజకవర్గాలకు పైగా ప్రచారం నిర్వహించిన కేసీఆర్ మరో రెండు రోజులు ప్రచారం చేయనున్నారు. ఈ నెల 29,30న పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది.

29న ఉదయం 11.30 గంటలకు ఆదిలాబాద్, 12.15కు కాగజ్‌నగర్.. మధ్యాహ్నం ఒంటిగంటకు ఆసిఫాబాద్, 1.45 గంటలకు బెల్లంపల్లి.. 2.30 గంటలకు మందమర్రి, 3.15 గంటలకు మంచిర్యాల, 4 గంటలకు రామగుండంలో పర్యటించనున్నారు.

30న ఉదయం 11.30 గంటలకు ఇల్లందు, 12.15 గంటలకు కొత్తగూడెం..ఒంటి గంటకు మణుగూరు(పినపాక నియోజకవర్గం).. 1.45 గంటలకు ములుగు, 2.30 గటలకు భూపాలపల్లి, 3.15 గంటలకు మంథని, 4 గంటలకు పెద్దపల్లిలో జరిగి టీఆర్‌ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

ఇవాళ ఎనమిది నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. ఉదయం 11 గంటలకు కల్వకుర్తి..11:45కి మహబూబ్‌నగర్..12:30కి వనపర్తి..1:15 కొల్లాపూర్…2 గంటలకు అచ్చంపేట…2:45కి నాగార్జునసాగర్‌లోని హాలియా..3:30 మునుగోడు..4:15కి ఆలేరు…నియోజకవర్గల్లో జరిగే సభలలో పాల్గొంటారు.

- Advertisement -