ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం

188
- Advertisement -

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రణాళికలు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినా ఇంకా ఆ వర్గాల్లో పేదరికం పోలేదన్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో ప్రగతి భవన్‌లో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో వందశాతం గుణాత్మకమైన మార్పు రావాలన్నారు. ఇంకా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఇంకా పేదరికం పోలేదని వారి అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాల్సి ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం అందరం కలిసి ఆలోచించి విధానం రూపొందించుకోవాలి. ఆ విధానాన్ని పకడ్బంధీగా అమలు చేసుకోవాలన్నారు.

Develop Sc/STs in a big way

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తీసుకురావడం మంచి పరిణామం అని తెలిపారు. విమర్శలు, ప్రతివిమర్శలు కాకుండా ఎస్సీ, ఎస్టీలకు ఏం అవసరమో ప్రభుత్వం ఏమి చేయాలో నిర్ణయించుకోవాలని కోరారు. మనం తలచుకుంటే తప్పక ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పుడున్న చట్టాన్ని బలోపేతం చేద్దామని చట్టంలో పారదర్శక వ్యూహం ఉండాలని తెలిపారు.

రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో సాగునీరు అందుతోంది. కాబట్టి వ్యవసాయం కూడా బాగుపడుతది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేసింది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు కాకుండా.. రెవెన్యూ క్యాపిటల్ పేరుతో బడ్జెట్‌లో చూపాలని కేంద్రం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఈ విధానం అనుసరించాలి. మన రాష్ట్రంలోనూ బడ్జెట్ రూపకల్పన జరగాలి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో మార్పులు రావాలని అధికారులు ఆదేశించారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వారి నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతం కంటే కొంచెం అధికంగా ఖర్చుపెట్టాలి. నిధులు కేటాయించడం… ఖర్చు చేయడానికి అవసరమైన విధానాన్ని ఎస్సీ, ఎస్టీ కమిటీ రూపొందించాలని సూచించారు.

- Advertisement -