దీక్షా దివస్…చరిత్రను మలుపు తిప్పినరోజు

2018
kcr deeksha
- Advertisement -

ప్రత్యేక తెలంగాణ కోసం ‘కేసీఆర్‌ చచ్చుడో – తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో 2009 నవంబరు 29న కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టారు. అదే తెలంగాణ ఏర్పాటుకు కీలకమలుపు. ఆరు దశాబ్దాల స్వప్నమైన తెలంగాణ రాష్ర్టాన్ని కేంద్రం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గంలో ఉద్యమాన్ని నడిపి చివరకు ఆమరణ దీక్షనే అస్త్రంగా సంధించిన కేసీఆర్ త్యాగఫలమే నేటి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్ర సాధనకు నడుం కట్టిన కేసీఆర్ తన దీక్షా వేదికగా సిద్దిపేటను ఎంచుకున్నారు. నవంబర్ 29న దీక్ష ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు రోజు రాత్రి కరీంనగర్‌లో బస చేసిన కేసీఆర్ భారీ జనసమూహం వెంటరాగా కరీంనగర్ నుంచి సిద్దిపేటవైపు కదిలారు. దీనికి భీతిల్లిన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలు మోహరించి కేసీఆర్‌ను కరీంనగర్ శివారు దాటకముందే అరెస్టు చేసి ఖమ్మం జిల్లా కేంద్ర కారాగారానికి తరలించింది. కేసీఆర్ జైలులోనే దీక్ష ప్రారంభించినట్టు ప్రకటించడంతో రాష్ట్రం అట్టుడికి పోయింది. ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చారు.

ఈ ఉద్వేగభరిత వాతావరణంలో కలత చెందిన ఉస్మానియా విద్యార్థి శ్రీకాంతాచారి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. రాష్ట్రం భగ్గుమంది. ధర్నాలు రాస్తారోకోలు, ఉద్యోగ సంఘాల పెన్‌డౌన్ పిలుపుతో రాష్ట్రం స్తంభించింది.

ఖమ్మం ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో…హుటాహుటిన పోలీసులు నిమ్స్ కు తరలించారు. పది రోజుల ఆమరణ దీక్షతో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. దీంతో గులాబి బాస్ దీక్ష విరమించారు. అలా కేసీఆర్ దీక్ష ఫలితంతో… దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది.

Also Read:ఫుడ్ సేఫ్టీపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

- Advertisement -